బారిసిటినిబ్‌పై కంపల్సరీ లైసెన్స్‌ దరఖాస్తు ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-05-18T06:01:48+05:30 IST

కొవిడ్‌ చికిత్సకు రెమిడెసివిర్‌తో కలిపి వినియోగించేందుకు అనుమతించిన బారిసిటినిబ్‌ ఔషధంపై కంపల్సరీ లైసెన్స్‌ (సీఎల్‌) కోసం చేసిన దరఖాస్తును నాట్కో ఫార్మా ఉపసంహరించుకుంది

బారిసిటినిబ్‌పై కంపల్సరీ లైసెన్స్‌ దరఖాస్తు ఉపసంహరణ

ఎలీ లిల్లీతో నాట్కో వాలంటరీ లైసెన్స్‌ ఒప్పందం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ చికిత్సకు రెమిడెసివిర్‌తో కలిపి వినియోగించేందుకు అనుమతించిన బారిసిటినిబ్‌ ఔషధంపై కంపల్సరీ లైసెన్స్‌ (సీఎల్‌) కోసం చేసిన దరఖాస్తును నాట్కో ఫార్మా ఉపసంహరించుకుంది. పేటెంట్‌ కార్యాలయం నుంచి సీఎల్‌ దరఖాస్తును ఉపసంహరించుకోవడమే కాక బారిసిటినిబ్‌ను తయారు చేయడానికి పేటెంట్‌ కంపెనీ అయిన ఎలీ లిల్లీతో రాయల్టీ ఫ్రీ, నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌, వాలంటెరీ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బారిసిటినిబ్‌పై ఎలీ లిల్లీతో వాలంటరీ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నామని.. దీనికి అనుగుణంగా బారిసిటినిబ్‌ను తయారు చేసి, విక్రయిస్తామని నాట్కో ఫార్మా వెల్లడించింది. కాగా బారిసిటినిబ్‌ తయారీకి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌, సిప్లా, లుపిన్‌, సన్‌ ఫార్మా, టోరెంట్‌లతో ఎలీ లిల్లీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలీ లిల్లీ ఔషధానికి జనరిక్‌ను తయారు చేసి మార్కెట్లో విక్రయించడానికి నాట్కో ఫార్మాకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే నాట్కో తయారు చేసిన ఔషధంపై దేశీయంగా పరీక్షలు నిర్వహించడానికి కూడా మినహాయింపు ఇచ్చింది. కాగా బారిసిటినిబ్‌ లభ్యతను భారత్‌లో మరింతగా పెంచేందుకు నాట్కోతో కుదుర్చుకున్న ఒప్పందం దోహదం చేస్తుందని ఎలీ లిల్లీ తెలిపింది.  

Updated Date - 2021-05-18T06:01:48+05:30 IST