గర్భందాల్చిన విషయం తెలియకుండానే.. బిడ్డకు జన్మనిచ్చింది!

ABN , First Publish Date - 2021-04-08T00:43:51+05:30 IST

గర్భందాల్చిన విషయం కూడా తెలియకుండానే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోస్టన్ నగరానికి చెందిన 38ఏళ్ల మెలిస్సా సర్జ్‌కాఫ్‌కు గతనెల 8న తీ

గర్భందాల్చిన విషయం తెలియకుండానే.. బిడ్డకు జన్మనిచ్చింది!

వాషింగ్టన్: గర్భందాల్చిన విషయం కూడా తెలియకుండానే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోస్టన్ నగరానికి చెందిన 38ఏళ్ల మెలిస్సా సర్జ్‌కాఫ్‌కు గతనెల 8న తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఈ క్రమంలో కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పిగా మెలిస్సా సర్జ్‌కాఫ్ భావించి బాత్రూంలోకి పరుగులు తీసింది. అనంతరం బాత్రూంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. ఆమె షాక్‌కు గురవ్వడంతోపాటు తన కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యపర్చింది. ఈ క్రమంలో మెలిస్సా సర్జ్‌కాఫ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. 


తాను గర్భందాల్చిన విషయం కూడా తనకు తెలియదని వెల్లడించింది. కొన్ని నెలలుగా బుుతుస్రావం కాకపోయినప్పటికీ.. పొట్ట పరిమాణం కూడా పెరగపోవడం వల్ల ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని గుర్తించలేకపోయినట్టు చెప్పారు. మార్చి 8న అకస్మాత్తుగా వచ్చిన నొప్పులను పురుటి నొప్పులుగా గ్రహించలేకపోయినట్టు తెలిపారు. కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పులుగా తొలుత భావించినట్టు వెల్లడించారు. అయితే జననాంగాల నుంచి రక్తం రావడాన్ని చూసి.. పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పులుగా అంచనా వేసినట్టు తెలిపారు. అనంతరం జననాంగాల నుంచి రక్తంతోపాటు మాంసం ముద్ద కూడా రావడాన్ని చూసి.. ఏదో అవయం తన శరీరం నుంచి బయటికి వస్తోందని భ్రమపడ్డానన్నారు.


చివరికి తన భర్త డొనాల్డ్ క్యాంప్‌బెలే.. తనకు అసలు విషయం చెప్పాడని మెలిస్సా సర్జ్‌కాఫ్ వెల్లడించారు. గట్టిగా అరవడంతో బాత్రూంలోకి వచ్చిన డొనాల్డ్ క్యాంప్.. తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్టు చెప్పాడన్నారు. దీంతో తాను షాక్‌కు గురయ్యానన్నారు. అంతేకాకుండా తనకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్టుగా డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. బ్రెజిల్‌కు చెందిన 20ఏళ్ల మహిళ, బ్రిటన్‌కు చెందిన 32 ఏళ్ల మరో మహిళ కూడా ఇదే విధంగా ప్రసవించారన్న వార్తలు ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-08T00:43:51+05:30 IST