ఏపీలో ఆడపడుచులకు కనీస గౌరవ మార్యాదలు దక్కుతున్నాయా?

ABN , First Publish Date - 2021-03-09T01:02:39+05:30 IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సోమవారం రైతులు, మహిళలు నిరసన తెలిపారు. దుర్గమ్మ అమ్మవారి గుడికి..

ఏపీలో ఆడపడుచులకు కనీస గౌరవ మార్యాదలు దక్కుతున్నాయా?

తాడేపల్లి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సోమవారం రైతులు, మహిళలు నిరసన తెలిపారు.  దుర్గమ్మ అమ్మవారి గుడికి, అలాగే మేరీమాత చర్చికి వెళ్లేందుకు వారిని పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో రైతులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 


ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ‘‘మేమేం పాపం చేశాం. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు కాళ్లతో తొక్కారు. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతుంటే పోలీసులు మాపై దారుణంగా వ్యవహరించారు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 


మహిళా దినోత్సవం రోజునే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ప్రపంచమంతటా మహిళా దినోత్సవం వేడుకలు. అమరావతి మహిళలపై మాత్రం ప్రభుత్వ అరాచకాలు. అమ్మవారి గుడికి వెళ్లే స్వేచ్ఛ కూడా లేని వ్యవస్థను ఏమనాలి?. మహిళలపై మగపోలీసులు విరుచుకుపడి చేయిజారడం ఏంటి?. ఈ దాడిని ప్రశ్నించే వారిని కూడా ఎగతాళి చేస్తారా?. అసలు ఏపీలో ఆడపడుచులకు కనీస గౌరవ మార్యాదలు దక్కుతున్నాయా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-03-09T01:02:39+05:30 IST