వరల్డ్‌క్లాస్‌ స్టోర్‌.. బ్రూయింగ్‌ క్రికెట్‌

ABN , First Publish Date - 2021-10-11T07:36:09+05:30 IST

ప్రఖ్యాత క్రికెట్‌ ఉపకరణాల కంపెనీ బ్రూయింగ్‌ క్రికెట్‌తో హైదరాబాద్‌కు చెందిన మల్టీ బ్రాండెడ్‌ క్రికెట్‌ ఉత్పత్తుల సంస్థ క్రిక్‌ ఫ్యూజ్‌ చేతులు కలిపింది.

వరల్డ్‌క్లాస్‌ స్టోర్‌.. బ్రూయింగ్‌ క్రికెట్‌

భారత మాజీ క్రికెటర్‌ వెంకటపతిరాజు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రఖ్యాత క్రికెట్‌ ఉపకరణాల కంపెనీ బ్రూయింగ్‌ క్రికెట్‌తో హైదరాబాద్‌కు చెందిన మల్టీ బ్రాండెడ్‌ క్రికెట్‌ ఉత్పత్తుల సంస్థ క్రిక్‌ ఫ్యూజ్‌ చేతులు కలిపింది. వేల కోట్ల క్రికెట్‌ విపణిలో సింహభాగం వాటాను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా క్రిక్‌ ఫ్యూజ్‌-బ్రూయింగ్‌.. 2022కల్లా దేశవ్యాప్తంగా పది అంతర్జాతీయస్థాయి క్రికెట్‌ ఉపకరణాల స్టోర్లను తెరవనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం గచ్చిబౌలిలో క్రిక్‌ ఫ్యూజ్‌-బ్రూయింగ్‌ క్రికెట్‌ స్టోర్‌ను భారత మాజీ క్రికెటర్‌ వెంకటపతి రాజు ప్రారంభించాడు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ‘ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన స్టోర్‌ నగరవాసులకు అందుబాటులోకి రావడం సంతోషం.



ప్రఖ్యాత క్రికెట్‌ బ్రాండ్ల ఉత్పత్తులన్నీ ఒకేచోట లభ్యమవడం వర్థమాన క్రికెటర్లకు ఉపయోగకరం. క్రికెటర్ల అభిరుచి, అవసరాలకు తగినట్టుగా బ్రూయింగ్‌ వ్యక్తిగత ప్రత్యేక కిట్లను తయారు చేయడం మంచి ఆలోచన. యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో బ్రూయింగ్‌ వ్యవస్థాపకులు మహేష్‌, కార్తీక్‌, శైలేష్‌, బ్రూయింగ్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ హెడ్‌ సన్నీ, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, క్రిక్‌ ఫ్యూజ్‌ బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ వేమూరి ఆదిత్య, ఫ్రాంచైజీ అండ్‌ కస్టమర్‌ అడ్వకసీ అండ్‌ టెక్నాలజీ హెడ్‌ వి.అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-11T07:36:09+05:30 IST