యోగాలో ‘శ్రీచైతన్య టెక్నో’ విద్యార్థుల వరల్డ్‌ రికార్డ్‌

ABN , First Publish Date - 2020-07-10T09:23:19+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ విద్యార్థులు అరుదైన రికార్డు సృష్టించారు. గత నెల 21న ఉదయం 7.00 నుంచి 7.40 గంటల వరకూ

యోగాలో ‘శ్రీచైతన్య టెక్నో’ విద్యార్థుల వరల్డ్‌ రికార్డ్‌

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ విద్యార్థులు అరుదైన రికార్డు సృష్టించారు. గత నెల 21న ఉదయం 7.00 నుంచి 7.40 గంటల వరకూ యూట్యూబ్‌ లైవ్‌ సెషన్‌ ద్వారా 15,452 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 38,874 మంది వారి వారి నివాసాల్లో ఒకే సారి యోగా చేయడం ద్వారా ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను శ్రీచైతన్య అకడమిక్‌ డైరెక్టర్‌ సీమకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి బింగి నరేంద్రగౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ మాట్లాడుతూ చదువుతోపాటు కోకరిక్యులర్‌ యాక్టివిటీస్‌, క్రీడలు, యోగా తదితర అంశాల్లో శ్రీచైతన్య విద్యార్థులదే అగ్రస్థానమని తెలిపారు.

Updated Date - 2020-07-10T09:23:19+05:30 IST