ఏబీఎన్ ఎఫెక్ట్ : వరల్డ్ టాయిలెట్ డే మరో రోజు నిర్వహిస్తామన్న ఉన్నతాధికారులు

ABN , First Publish Date - 2021-11-18T17:56:07+05:30 IST

వరల్డ్ టాయిలెట్ డే శుక్రవారం నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉపయోగించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు పంపారు.

ఏబీఎన్ ఎఫెక్ట్ : వరల్డ్ టాయిలెట్ డే మరో రోజు నిర్వహిస్తామన్న ఉన్నతాధికారులు

అమరావతి : ఏపీ విద్యాశాఖ ఇచ్చిన విచిత్ర ఉత్తర్వులపై ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనాలపై స్పందించిన విద్యాశాఖ.. వరల్డ్ టాయిలెట్ డే శుక్రవారం నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉపయోగించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు పంపారు. వరల్డ్ టాయిలెట్ డే మరో రోజు నిర్వహిస్తామని ఉన్నతాధికారులు మెసేజ్‌లో పేర్కొన్నారు. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా హెడ్ మాస్టర్‌లు, ఉపాధ్యాయులు టాయిలెట్లు కడగాలని ఇచ్చిన ఆదేశాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవడం పట్ల ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.




Updated Date - 2021-11-18T17:56:07+05:30 IST