Abn logo
Aug 4 2020 @ 22:14PM

నిర్ణయం మార్చుకోను.. ఐపీఎల్‌పై ఆసీస్ పేసర్ స్టార్క్!

కాన్‌బెర్రా: ఐపీఎల్-2020 నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని ఆసీస్ స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ తేల్చిచెప్పాడు. కరోనా కారణంగా ఏప్రిల్‌లో ప్రారంభం కావల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో తాను ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్క్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌కు సమాయత్తం అవడం కోసమే స్టార్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో స్టార్క్ నిర్ణయంలో మార్పుంటుందని అంతా భావించారు.  ‘ఐపీఎల్ 13 నుంచి తప్పుకోవాలన్న నా నిర్ణయం మార్చుకోను’ అని స్టార్క్ స్పష్టంగా చెప్పేశాడు. ఐపీఎల్ షెడ్యూల్ టైం మారిపోయిందని, అయినా సరే తన నిర్ణయంలో మార్పుండదని తేల్చిచెప్పాడు.

Advertisement
Advertisement
Advertisement