Advertisement
Advertisement
Abn logo
Advertisement

Moradabad: అనధికార రెజ్లింగ్ మ్యాచ్‌లో గాయాలతో రెజ్లర్ మృతి

మొరాదాబాద్ పోలీసుల దర్యాప్తు

మొరాదాబాద్: అనధికార రెజ్లింగ్ మ్యాచ్‌లో పాల్గొన్న ఓ రెజ్లర్ తీవ్రంగా గాయాలపాలై మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలో వెలుగుచూసింది. మొరాదాబాద్ నగరంలో జరిగిన అనధికార రెజ్లింగ్ పోటీల్లో ఓ రెజ్లర్ తీవ్రంగా గాయపడ్డాడు. మెడకు తగిలిన తీవ్ర గాయాలతో రెజ్లర్ మరణించారు. పోలీసులకు చెప్పకుండా రహస్యంగా రెజ్లర్ మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై రెజ్లర్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు స్పందించి కేసు పెట్టారు. రెజ్లర్ మృతి ఘటనపై తాము ఐపీసీ సెక్షన్ 34 ఎ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మొరాదాబాద్ డీఎస్పీ అనూప్ కుమార్ చెప్పారు. అనధికారికంగా నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో ఈ ఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement