నన్ను కాదు.. పంత్‌నే తుది జట్టులోకి తీసుకోవాలి: సాహా

ABN , First Publish Date - 2021-05-22T22:35:06+05:30 IST

వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంతే సరైనోడని మరో కీపర్ వృద్ధిమాన్ సాహా అంగీకరించాడు.

నన్ను కాదు.. పంత్‌నే తుది జట్టులోకి తీసుకోవాలి: సాహా

వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంతే సరైనోడని మరో కీపర్ వృద్ధిమాన్ సాహా అంగీకరించాడు. కొంత కాలంగా పంత్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా మొదటి ప్రాధాన్యత కీపర్‌గా ఉండేందుకు పంత్ అర్హుడని సాహా పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసిన 20 మంది టీమ్‌లో పంత్‌తో పాటు సాహాను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. 


`కొంత కాలంగా పంత్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా మొదటి ప్రాధాన్యతా కీపర్‌గా ఉండేందుకు పంత్ అర్హుడు. నేను వెయిట్ చేస్తా. ఒకవేళ నాకు అవకాశం వస్తే మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. ఆ ఒక్క అవకాశం కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. పరిస్థితులతో సంబంధం లేకుండా నేను నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తా. అవకాశం వస్తే మెరుగైన ప్రదర్శన చేయడం మాత్రమే నా చేతిలో ఉంద`ని సాహా అన్నాడు.  

Updated Date - 2021-05-22T22:35:06+05:30 IST