Abn logo
Jun 29 2021 @ 20:30PM

స్టెప్పేసిన వైరా ఎమ్మెల్యే

ఖమ్మం: ఆనందం అవధులు దాటింది. అందరి కోరిక మేరకు ఆ ఎమ్మెల్యే స్టెప్పులు వేసారు. జిల్లాలోని కారేపల్లి మండలంలోని పాటిమీద గుంపు  గ్రామ సర్పంచ్ వివాహం జరిగింది. ఈ వివాహానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. ఈ వివాహానికి పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా ఆట పాటలతో నాయకులు నృత్యాలు చేశారు. డాన్స్ చేస్తున్న నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాములు నాయక్ స్టెప్పేసి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. తనలో దాగిఉన్న డ్యాన్స్ కళను ఎమ్మెల్యే అందరిముందు ప్రదర్శించారు. మొత్తానికి ఎమ్మెల్యే రాములు నాయక్ డ్యాన్స్ అక్కడున్న వారందరిని అలరింపజేసింది. ఎమ్మెల్యే డ్యాన్స్ వీడియో జిల్లాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.