హరీష్‌రావు వ్యాఖ్యలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: యరపతినేని

ABN , First Publish Date - 2020-09-23T20:10:42+05:30 IST

గుంటూరు: తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సూచించారు.

హరీష్‌రావు వ్యాఖ్యలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: యరపతినేని

గుంటూరు: తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. 4 వేల కోట్లకు ఆశపడి విద్యుత్ మీటర్లతో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారన్నారు. రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారని యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.

Updated Date - 2020-09-23T20:10:42+05:30 IST