Abn logo
Mar 9 2021 @ 18:32PM

కర్ణాటక మద్యం పంపిణీలో వైసీపీ కార్యకర్తలు

చిత్తూరు: రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు మద్యం పంపిణీలో బిజీగా ఉన్నారు. పలమనేరు మున్సిపాలిటీలోని గొబ్బిళ్ళ కోటూరు, గంటావూరు కాలనీలలో ఓటర్లకు కర్ణాటక మద్యం ప్యాకెట్లను వైసీపీ కార్యకర్తలు పంపిణీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ముందే వైసీపీ కార్యకర్తలు మద్యం పంపకాలు చేశారు. అయితే వైసీపీ నాయకులు మద్యం పంపకాలు జరుపుతుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో కర్ణాటక మద్యంతో వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు.