Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీకి వైసీపీ విజ్ఞప్తి

కాకినాడ: పిఠాపురం మున్సిపాలిటీలో 11వ వార్డు ఉప ఎన్నిక వ్యవహారం రసవత్తరంగా మారింది. పిఠాపురం మున్సిపాలిటీలో 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అనారోగ్యంతో చనిపోయారు. తిరిగి మృతుడి కుటుంబం నుంచే బరిలోకి దింపాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలో దించవద్దని వైసీపీ విజ్ఞప్తి చేసింది. అయినా పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మళ్లీ మరోసారి టీడీపీ పోటీ చేయవద్దని మృతుడి కుటుంబీకులు, వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీంతో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ స్థానిక టీడీపీ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై మరో వర్గం మీడియా టీడీపీపై దుష్ప్రచారం చేస్తుందని వర్మ మండిపడ్డారు. వైసీపీ విజ్ఞప్తి మేరకు టీడీపీ సానుభూతి నిర్ణయం తీసుకుంటే టీడీపీ వెనక్కి తగ్గిందని ప్రచారం చేయడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

TAGS: TDP YCP

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement