గూగుల్‌ ఫొటోస్‌లో..‘ఇయర్‌ ఇన్‌ రెవ్యూ’

ABN , First Publish Date - 2021-01-02T06:15:17+05:30 IST

గూగుల్‌ ఫొటో వినియోగదారుల కోసం ‘ఇయర్‌ ఇన్‌ రెవ్యూ’ని విడుదల చేసింది. ఏడాది మొత్తంలో తీసిన టాప్‌ ఫోటోలను ఇది తెలియజేస్తుంది

గూగుల్‌ ఫొటోస్‌లో..‘ఇయర్‌ ఇన్‌ రెవ్యూ’

గూగుల్‌ ఫొటో వినియోగదారుల కోసం ‘ఇయర్‌ ఇన్‌ రెవ్యూ’ని విడుదల చేసింది. ఏడాది మొత్తంలో తీసిన టాప్‌ ఫోటోలను ఇది తెలియజేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ ప్లాట్‌ఫారమ్స్‌పై ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. మోమరీస్‌ కారోసెల్‌(జ్ఞాపకాల రంగులరాట్నం)లో ఇది కనిపిస్తుంది. జ్ఞాపకాల మాదిరిగానే దీన్ని అటూ ఇటూ నేవిగేట్‌ చేసుకోవచ్చు. లాంగ్‌ ప్రెస్‌ లేదంటే పాజ్‌ను పట్టిఉంచడం ద్వారా అవసరానుగుణంగా చూసుకోవచ్చు.  ప్రతి ఫొటోపై  డేట్‌, లొకేషన్‌ కనిపిస్తాయి. సాధారణ షేరింగ్‌ బటన్స్‌ కూడా ఉంటాయి. క్విక్‌ షార్ట్‌ కట్‌ కూడా ఉంది. ‘ప్రివ్యూ బుక్‌’ బటన్‌తో వర్చ్యువల్‌ ఫొటో బుక్‌ను రూపొందించుకోవచ్చు. మాన్యువల్‌గా ఫొటోల తొలగింపు లేదంటే కలుపుకొనే సదుపాయం కూడా ఉంది. గూగుల్‌ ఇటీవలి  కాలంలో ఇలాంటి చాలా ఫీచర్లను పరిచయం చేసింది. 

Updated Date - 2021-01-02T06:15:17+05:30 IST