Abn logo
Jul 28 2021 @ 00:33AM

జావాపై జోరుగా

కుర్రకారు కలల బైక్‌ జావా. దానిపై రైడ్‌ అంటే... అదీ సమరోత్సాహాన్ని నింపే కార్గిల్‌ నుంచైతే! ఆ అనుభూతిని రియల్‌ హీరోలకు అందించింది ‘జావా’ సంస్థ. కొత్తగా విడుదల చేసిన ఖాకీ, మిడ్‌నైట్‌ గ్రే కలర్స్‌ మోటర్‌ సైకిళ్లపై భారత జవాన్లు దూసుకుపోయారు. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’, అలాగే రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ‘ధ్రువ కార్గిల్‌ రైడ్‌’ను జావా నిర్వహించింది.

 మొత్తం 75 మంది రైడర్లు నాలుగు బృందాలుగా విడిపోయి ర్యాలీ కొనసాగించారు. ‘ధ్రువ వార్‌ మెమోరియల్‌’ వద్ద ప్రారంభమై... డ్రాస్‌లోని ‘కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌’ వరకు సాగింది. 1971 యుద్ధంలో భారత సైనికుల తెగువ, త్యాగాలకు గుర్తుగా జావా ఈ కొత్త మోడల్స్‌ను తీసుకువచ్చింది. అంతేకాదు... మొదటి బ్యాచ్‌ మోటర్‌సైకిల్స్‌ను వేలంలో అమ్మగా వచ్చిన రూ.1.49 కోట్లను ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే ఫండ్‌’కు ఇచ్చింది.