Abn logo
Apr 1 2021 @ 11:58AM

బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌ కలకలం..

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : బంజారాహిల్స్‌లో ఓ యువతి కిడ్నా‌ప్ అయినట్లు వీడియోలు బయటకు రావడం కలకలం సృష్టించింది. రోడ్డు నెంబరు-03 ఆల్‌మండ్‌ హౌస్‌ వెనకాల యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లినట్టు ఓ ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డు అయింది. వీడియో ఆధారంగా బంజారాహిల్స్‌ పోలీసులు విచారణ చేయగా.. కిడ్నాప్‌ జరగలేదని నిర్ధారణ అయింది. కొంతమంది మద్యం తాగి హంగామా సృష్టించినట్లు కొన్ని ఆధారాలు లభించాయి. కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Advertisement
Advertisement
Advertisement