‘స్టార్టప్స్‌ ఫర్‌ రైల్వేస్’లో..యువత భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2022-06-15T08:40:20+05:30 IST

‘స్టార్టప్స్‌ ఫర్‌ రైల్వేస్’లో..యువత భాగస్వామ్యం కావాలి

‘స్టార్టప్స్‌ ఫర్‌ రైల్వేస్’లో..యువత భాగస్వామ్యం కావాలి

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో అంకుర సంస్థలకు ఆహ్వానం 

విజయవాడ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘స్టార్టప్స్‌ ఫర్‌ రైల్వేస్‌’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ డివిజన్‌ పరిధిలో రైల్వేకు అవసరమైన సాంకేతిక ఆవిష్కరణలు అందించేందుకు అంకుర సంస్థలు (స్టార్టప్స్‌), యువతకు ఆహ్వానం పలుకుతున్నట్టు విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) శివేంద్ర మోహన్‌ చెప్పారు. రైల్వేకు సమస్యాత్మకంగా మారిన 100 అంశాలలో తొలివిడతగా గుర్తించిన 11 అంశాలకు సంబంధించి పరిష్కారాలను చూపేలా సాంకేతిక ఆవిష్కరణలు చేసే స్టార్ట్‌పలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థల ఐడియాలకు ఆచరణ రూపం కల్పించేందుకు రైల్వే ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని, ఈ అవకాశాన్ని స్టార్ట్‌పలు, వ్యక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. విజయవాడ డీ ఆర్‌ఎం కార్యాలయం ఆవరణలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొలివిడతగా 11 సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కొనుగొనాలన్నది తమ ఉద్దేశమన్నారు. దీని కోసం అంకుర సంస్థలు తమ ఐడియాలతో ముందుకొస్తే వాటిని పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేస్తామన్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు రైల్వే మొదటి విడతగా రూ.1.50 కోట్లు, ట్రయల్స్‌ పూర్తయిన తర్వాత రూ. 3 కోట్ల మేర ఖర్చు చేస్తామని తెలిపారు. అనంతరం ఆ సాంకేతికతను రైల్వే ఉపయోగించుకుంటుందన్నారు. ఈ ఆవిష్కరణకు అంకుర సంస్థలే టైటిల్‌ దారులుగా ఉంటాయని తెలిపారు. దీని కోసం డివిజన్‌ స్థాయిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అడిషనల్‌ డీఆర్‌ఎం ఎం.శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రైల్వే గుర్తించిన 11 సమస్యాత్మక అంశాలకు సంబంధించి ఆవిష్కరణలు కోరుతున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 21 నుంచి  https://www.innovation.indianrailways. gov.in సైట్‌కు లాగిన్‌ అవటం ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవటంతో పాటు, తమ ఆవిష్కరణలు, ఐడియాలను అప్‌లోడ్‌ చేయవచ్చన్నారు. సమావేశంలో సీనియర్‌ డీ విజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ వావిలపల్లి రాంబాబు, ప్రజా సంబంధాల అధికారి నుస్రత్‌లు పాల్గొన్నారు. సైట్‌కు లాగిన్‌ అవటం ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవటంతో పాటు, తమ ఆవిష్కరణలు, ఐడియాలను అప్‌లోడ్‌ చేయవచ్చన్నారు. సమావేశంలో సీనియర్‌ డీ విజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ వావిలపల్లి రాంబాబు, ప్రజా సంబంధాల అధికారి నుస్రత్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-15T08:40:20+05:30 IST