మళ్లీ మళ్లీ కలిసే తొందర!

ABN , First Publish Date - 2021-06-02T05:30:00+05:30 IST

ఒక హ్యాండ్సమ్‌ కుర్రాడు... శ్రీను! వింటేజ్‌ కార్ల షోరూమ్‌ పెట్టాలని తాపత్రయపడుతుంటాడు. ఉద్యోగం చేస్తూనే దాని కోసం ప్రణాళికలు వేస్తుంటాడు. ఓ అందమైన యువతి... అభి! సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకొంటూ తన పెళ్లి ప్రయత్నాల్లో ఉంటుంది. ఇద్దరూ మంచి మిత్రులు. ఒక రోజు కలుస్తారు.

మళ్లీ మళ్లీ కలిసే తొందర!

యూబ్యూబ్‌ హిట్‌


ఒక హ్యాండ్సమ్‌ కుర్రాడు... శ్రీను! వింటేజ్‌ కార్ల షోరూమ్‌ పెట్టాలని తాపత్రయపడుతుంటాడు. ఉద్యోగం చేస్తూనే దాని కోసం ప్రణాళికలు వేస్తుంటాడు. ఓ అందమైన యువతి... అభి! సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకొంటూ తన పెళ్లి ప్రయత్నాల్లో ఉంటుంది. ఇద్దరూ మంచి మిత్రులు. ఒక రోజు కలుస్తారు. ‘అప్‌డేట్స్‌ ఏంటి’... అడుగుతాడు అతడు. ‘పెళ్లి చూపుల గురించేనా! అది డిజాస్టర్‌’... తను బదులిస్తుంది. ఆమెకు అది 21వ పెళ్లిచూపులు. ‘నెక్ట్స్‌ ఇయర్‌ నాకు థర్టీస్‌ స్టార్ట్‌ అవుతాయి. ఈ మధ్య నా మీద నాకే డౌటొస్తోంది. కానీ చూడ్డానికి నేను బానే ఉంటానుగా! చెప్పరా’ అంటుంది తను. ‘నువ్వు ఇప్పించిన మిల్క్‌షేక్‌ అయిపోయింది కాబట్టి... నువ్వు యావరేజ్‌’. ‘ఇంకోటి ఇప్పిస్తే?’... ‘యూ ఆర్‌ బ్యూటిఫుల్‌’ అంటాడు అతడు. ‘ఈ సోదంతా ఆపు గానీ... నా షోరూమ్‌కి సూపర్‌ లొకేషన్‌ దొరికింది తెలుసా! ఇక్కడే బంజారాహిల్స్‌లో!’... అని ఎంతో ఉత్సుకతతో చెబుతాడు. ‘అద్దె ఎంత’... ‘నాలుగు లక్షలే...’ ఏదో చెప్పబోతాడు. ‘నువ్వు అంతకముందు చేసిన ప్రయత్నానికే మీ నాన్న సగం ఆస్తి అయిపోయింది.


ఇప్పుడు ఇంకో సగం కూడా ఉంచేలా లేవు’ అంటుంది. ‘చూడు శ్రీను... నువ్వు ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యావు. తప్పు ఎక్కడ జరిగిందో ఎనలైజ్‌ చేసుకున్నావా? అది వదిలేసి చుట్టుపక్కలవారిని బ్లేమ్‌ చేయడం అలవాటైపోయింది నీకు’... తను సూటిగా చెబుతుంది. తప్పు ఎత్తిచూపే సరికి శ్రీనులో కోపం. ‘నేను ఎవరినీ తప్పు పట్టడంలేదు. అయినా ఏంటి... మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నావు... జాబ్‌ ఇప్పించానని’ అంటాడు. ‘ఇప్పుడు జాబ్‌ మాట ఎవరెత్తార్రా! అయినా నీతో మాట్లాడటమే వేస్ట్‌’ అని వెళ్లిపోతూ మళ్లీ ఆగుతుంది. వచ్చి సారీ చెబుతుంది. కోపంగా నాలుగు అడుగులు వేసిన శ్రీను కూడా వెనక్కి వస్తాడు. ‘అయినా అభి... నీకన్నీ తెలుసు. మా నాన్నేమో ఆయన దగ్గర అంతకంటే డబ్బు లేదంటారు. అమ్మ కూడా అంతే! నా పని ఎవరూ నన్ను సరిగ్గా చేసుకోనివ్వలేదు కదా!’... ఏదో చెప్పబోతాడు. 


‘చూశావా... నేను చెప్పేది కూడా అదే! ఇంత చేసినా మళ్లీ అమ్మానాన్నలనే అంటున్నావు’... అభి అభియోగం. తనకు ఉద్యోగం ఇప్పించిందన్న కారణంతోనే అభి తనతో అలా మాట్లాడుతోందనేది శ్రీను అభిప్రాయం. ‘ఇంకోసారి జాబ్‌ విషయం మాట్లాడితే ఊరుకోను. ఎంత సెల్ఫిష్‌విరా నువ్వు... అయినా ఇంత చేసినా జాబ్‌ మాత్రమే గుర్తుపెట్టుకున్నావ్‌!’... ‘ఏంచేశావే... ఏంచేశావ్‌ చెప్పు’... ‘పోరా... అయినా మనం కలిసిన ప్రతిసారీ నీ తొక్కలో షోరూమ్‌ గురించే. అందులో నా డబ్బులు కూడా ఉన్నాయ్‌... గుర్తు పెట్టుకో. అసలు నా గురించి, నా కష్టాల గురించి ఒక్కసారైనా మాట్లాడావా’ అంటుంది. ఈ వాదన ఎక్కడిదాకా వెళ్లింది? చివరకు ఏంజరిగింది? ‘మళ్లీ మళ్లీ కలిసే తొందర’ లఘుచిత్రంలో చూస్తేనే బాగుంటుంది. రవితేజ, గోల్డీ నిస్సీ గ్లామర్‌, హావభావాలు... గురుకుమార్‌ రచన, దర్శకత్వపు ప్రతిభ ఆకట్టుకొంటాయి. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను మూడు రోజుల్లోనే 3.5 లక్షల మందికి పైగా వీక్షించారు. 

Updated Date - 2021-06-02T05:30:00+05:30 IST