Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిగ్ బ్రేకింగ్: మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న YS Jagan ప్రభుత్వం

అమరావతి: మూడు రాజధానుల చట్టాలను ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు నిర్ణయాల్ని ఏపీ కేబినెట్‌ వెనక్కి తీసుకుంది. సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయం గురించి ప్రకటన చేయనున్నారు. ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయని, అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు.

Advertisement
Advertisement