Abn logo
Aug 5 2021 @ 15:35PM

సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల్ ఫైర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారని ఆమె మండిపడ్డారు. రూ.38,500 కోట్లతో మొదలై.. రూ.లక్షా 20 వేల కోట్లకు చేరిందన్నారు. ఒకవైపు ఉద్యోగుల జీతాలకు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్ముకోవాలని పేర్కొన్నారు. మేఘా ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం కోట్లకు కోట్లు వస్తాయన్నారు.