వైఎస్ షర్మిల, విజయలక్ష్మికి నాంపల్లి కోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-10-01T01:32:33+05:30 IST
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, విజయలక్ష్మికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది.
హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, విజయలక్ష్మికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది. పరకాల ఎన్నికల కేసు విచారణలో భాగంగా గురువారం నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని, కోడ్ ఉల్లంఘించినందుకుగాను పరకాల పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మి, షర్మిల, కొండా సురేఖ దంపతులపై కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో పరకాల నుంచి వైసీపీ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో ఉన్నారు. కొండా సురేఖ, కొండా మురళి సహా తొమ్మిది మందిపై నమోదు చేసిన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.