Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆఖరి గింజ వరకు వరి కొనాల్సిందే: షర్మిల

నల్లగొండ: రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యంలో ఆఖరి గింజ వరకు కొనాల్సిందేనని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు.   జిల్లాలో జరిగిన నిరుద్యోగ దీక్షలో షర్మిల మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయని ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమన్నారు. రైతుల సంక్షేమం కోసం మాటల్లో కాదు చేతల్లో చూపాలని ఆమె సవాల్ విసిరారు. ప్లోరైడ్ బారిన పడిన నల్గొండ జిల్లా వాసులకు సాగు, త్రాగు అందించలేని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కుంభకర్ణుడిలాగా మారిందని ఆమె ధ్వజమెత్తారు. రైతులను వరి పంట వేయొద్దన్న సీఎం, కేంద్రం మీద నెట్టే ఆలోచనలు చేయడం సిగ్గు చేటని షర్మిల పేర్కొన్నారు. 

Advertisement
Advertisement