ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటీషన్‌పై విచారణ

ABN , First Publish Date - 2021-06-25T20:44:20+05:30 IST

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటీషన్‌పై విచారణ

అమరావతి: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది. అయితే రిట్ అప్పీల్ పరిష్కారం అయ్యేవరకు కౌంటింగ్ నిర్వహించవద్దని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ జులై 27కు వాయిదా వేసింది. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. 


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి అయినప్పటికీ ఈ రోజు వరకు కౌంటింగ్ నిర్వహించలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించలేదనే ఉద్దేశంతోనే సింగిల్ బెంచ్ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. కాగా సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై డివిజనల్ బెంచ్‌లో విచారణ జరిగింది.

Updated Date - 2021-06-25T20:44:20+05:30 IST