కనకమహాలక్ష్మికి లడ్డూల నివేదన

ABN, First Publish Date - 2023-10-18T01:41:24+05:30 IST

వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా సాగుతున్నాయి.

ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు

వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు ధాన్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపారాధన, కలశస్థాపన, సప్తశతి మహావిద్య, శ్రీచక్రవరార్చన, హోమాలు నిర్వహించిన అనంతరం సురేష్‌, మాధవి దంపతులు సమకూర్చిన లడ్డూలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. కనకమహాలక్ష్మి బుధవారం ధైర్యలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు.

- పూర్ణామార్కెట్‌

Updated at - 2023-10-18T01:41:24+05:30