Share News

SUICIDE : ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - May 08 , 2024 | 12:17 AM

పట్టణంలోని రెండోవార్డుకు చెం దిన ఆశా కార్యకర్త షబ్బరీ మంగళ వారం ఆత్మహ త్యా య త్నానికి పాల్ప డింది. ఉన్నతాధి కారుల వేధింపుల తో ఆమె విషద్రావ కం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యక ర్తలు ఆసుప్రతి వద్ద రోడ్డుపై భైఽఠాయించి ధర్నా చేపట్టారు. శివాల యం వీధిలోని ఆరోగ్య ఉపకేంద్రం వద్ద 104 వాహనంలో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య పరీక్షలను మంగళవారం నిర్వహించారు. ఆ సమ యంలో బీపీ మిషన, స్టెతస్కోప్‌ కనిపించ లేదని ఎంఎల్‌హెచపీ గౌతమి దొంగతనం నేరం మోపుతూ ఆశాకా ర్యకర్త షబ్బరీని అందరి ముందు మందలించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన షబ్బరీ జెండాలబండ వీధిలోని తన ఇంటికెళ్లి విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

SUICIDE : ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం
Hope worker Shabbari is undergoing treatment at the hospital

సీఐటీయూ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ధర్నా

గోరంట్ల, మే 7: పట్టణంలోని రెండోవార్డుకు చెం దిన ఆశా కార్యకర్త షబ్బరీ మంగళ వారం ఆత్మహ త్యా య త్నానికి పాల్ప డింది. ఉన్నతాధి కారుల వేధింపుల తో ఆమె విషద్రావ కం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యక ర్తలు ఆసుప్రతి వద్ద రోడ్డుపై భైఽఠాయించి ధర్నా చేపట్టారు. శివాల యం వీధిలోని ఆరోగ్య ఉపకేంద్రం వద్ద 104 వాహనంలో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య పరీక్షలను మంగళవారం నిర్వహించారు. ఆ సమ యంలో బీపీ మిషన, స్టెతస్కోప్‌ కనిపించ లేదని ఎంఎల్‌హెచపీ గౌతమి దొంగతనం నేరం మోపుతూ ఆశాకా ర్యకర్త షబ్బరీని అందరి ముందు మందలించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన షబ్బరీ జెండాలబండ వీధిలోని తన ఇంటికెళ్లి విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.


అస్వస్తతకు గురైన ఆమె ను గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించగా డాక్టర్‌ వినోద్‌కుమార్‌ వైద్య చికిత్సలందించారు. ఎంఎల్‌హెచపీ గౌతమి కొంతకాలంగా ఏదో ఒక నేపంతో తనను వేధిస్తోందని, కొందరు ఆశాకార్యకర్తలు మద్దతు పలుకుతుండడంతో ఈఘాతుకా నికి పాల్పడినట్లు బాధితరాలు షబ్బరీ ఆసుపత్రిలో తెలిపారు. ఆ మెను మెరుగైన వైద్యం కోసం 108లో హిందూపురం తరలించారు. ఆశాకార్యకర్తల ధర్నా: ఆశాకార్యకర్త షబ్బరీ ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకుని సీఐటీయూ నాయకుడు సాంబశివ ఆధ్వర్యం లో ఆశాకార్యకర్తలు గోరంట్ల పీహెచసీ ఎదుట సాయంత్రం ధర్నా నిర్వహించారు.


ఇందుకు బాధ్యురాలైన గౌతమిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రి ఎదుటున్న హిందూపురం - కదిరి ప్రధాన రహదారిపై బైఠాయించి, రాకపోకలను స్తంభింపచే శారు. డాక్టర్‌ శ్రుతి ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది అక్కడికి చేరుకుని వారి చర్చించారు. సీఐ సుబ్బరాయుడు సర్దిచెప్పారు. ఆశాకార్య కర్తలు ఇచ్చిన పిర్యాదును డాక్టర్‌కు అదించంగా, చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు డాక్టర్‌ తెలిపా రు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే పోలీస్‌ కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:17 AM