Share News

SSA OFFICER : అంతా నా ఇష్టం..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:45 AM

సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్‌కు మనం ఎంత చెబితే అంత..’ ...

SSA OFFICER : అంతా నా ఇష్టం..!

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 27: సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం.


‘కలెక్టర్‌కు మనం ఎంత చెబితే అంత..’ అని.. గతంలో పనిచేసి ఓ కలెక్టర్‌ గురించి చెప్పుకునే ఆ అధికారి.. అదే ధీమాతో నియామక చర్యలకు పూనుకున్నారని తెలిసింది. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఓ మహిళ నుంచి దరఖాస్తు తీసుకున్నారని సమాచారం. నెల రోజులకు పైగా ఆమెతో పనులు కూడా చేయిస్తున్నారని తెలిసి.. ఆ శాఖలోనివారే విస్తుపోతున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:45 AM