Share News

TDP: పల్లె కుటుంబం విస్తృత ప్రచారం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:06 AM

నియోజకవర్గంలో పల్లె కుటుంబీకులు శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి పంచాయతీ మార్లపల్లిలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేపట్టారు. గ్రామంలోకి రాగానే ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం వారు ఇంటింటా తిరిగి ప్రజలను పలకరిస్తూ..

TDP: పల్లె కుటుంబం విస్తృత ప్రచారం

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 19: నియోజకవర్గంలో పల్లె కుటుంబీకులు శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి పంచాయతీ మార్లపల్లిలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేపట్టారు. గ్రామంలోకి రాగానే ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం వారు ఇంటింటా తిరిగి ప్రజలను పలకరిస్తూ.. సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పల్లె సింధూర మాట్లాడుతూ కూ టమి అధికారంలోకి వస్తే పుట్టపర్తి నియోజకవర్గానికి అం తర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్నారు. నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే కనపడుతోందన్నారు.


వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టలేదన్నారు. సీఎం జగన పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. ఆయనకు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు లేదన్నారు. మాట తప్పిన జగనకు ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజల్ని కోరారు. తర్వాత పల్లె రఘు నాథ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రైతులకు పంటసాయం కింద ఏడాదికి రూ. 20వేలు ఇస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరను, హిందూపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు.


కార్యక్రమంలో టీడీపీ మండలకన్వీనర్‌ విజయ్‌కుమార్‌, నాయకులు శ్రీరామిరెడ్డి, పుల్లప్ప, బొమ్మయ్య, శ్రీరాంనాయక్‌, నాగరాజు, మెహరాలి, కప్పలబండ రోశయ్య, మురారి, బద్రి, శ్యామల, సుజాతబాయితో జనసేన, బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 11:53 AM