Share News

Anam: జగన్‌ను ఆఫ్‌ టికెట్ అంటూ ఆనం సెటైర్...

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:43 PM

Andhrapradesh: ‘‘ఆఫ్ టిక్కెట్ జగన్ నెల్లూరుకి వచ్చి అయిదేళ్లు అయింది. ముద్దులు పెట్టావు... మళ్ళీ ఈ రోజు నెల్లూరు వచ్చావు’’ అంటూ సీఎం జగన్‌పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీఆర్ బాండ్స్ నకళ్లని ఆనం దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరుడు అవినీతి వద్దని చెప్పడం హాస్యాస్పదమని...‘‘మీ కుటుంబం అవినీతి కుటుంబం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Anam: జగన్‌ను ఆఫ్‌ టికెట్ అంటూ ఆనం సెటైర్...

నెల్లూరు, ఏప్రిల్ 6: ‘‘ఆఫ్ టిక్కెట్ జగన్ (CM Jagan) నెల్లూరుకి వచ్చి అయిదేళ్లు అయింది. ముద్దులు పెట్టావు... మళ్ళీ ఈ రోజు నెల్లూరు వచ్చావు’’ అంటూ సీఎం జగన్‌పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (TDP Leader Anam Venkataramana reddy) తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీఆర్ బాండ్స్ నకళ్లని ఆనం దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరుడు అవినీతి వద్దని చెప్పడం హాస్యాస్పదమని...‘‘మీ కుటుంబం అవినీతి కుటుంబం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు విస్తరణకు ఇచ్చే టీడీఆర్ బాండ్స్‌కు సంబంధించి రూ.10వేలకోట్ల అక్రమాలు వెలుగులోకి తెచ్చామన్నారు. మున్సిపల్ చీఫ్ సెక్రటర్ శ్రీలక్ష్మీ ఇవి దొంగ బాండ్లని బయట పెట్టారని తెలిపారు.

Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..


టీడీపీ ప్రభుత్వం వస్తుందని బయపడ్డారని.. రూ.4వేల కోట్లు బయట పెట్టమని అడిగారని.. . మరి 2వేల కోట్లు బాండ్లు అమ్మకాలు పెట్టారని.. వాటి విషయం ఏమి చేస్తారని ప్రశ్నించారు. దోపిడీ చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, అభినయరెడ్డి మరికొందరు ఉన్నారని... వారిని అరెస్ట్ చేయాలన్నారు. అప్పటి కలెక్టర్ ని, కమిషనర్ హరితని అరెస్ట్ చేయాలన్నారు. ఆమె సొంత తమ్ముడుని అడ్డంపెట్టుకుని అనేక అక్రమాలు చేశారని... ఆర్డీఓ కూడా సూత్రదారే అని ఆరోపించారు. రెవిన్యూ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఎవరినీ వదలమని హెచ్చరించారు. గూండాలని పెట్టి బెదిరించి భూములు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రూ.10వేల నుంచి రూ.20వేలు ఉండే వ్యవసాయ భూమిని లక్ష నుంచి 2లక్షలు కమర్శియల్‌గా మార్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేయాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్స్‌లో మోసపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ల విషయంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విచిత్రమైన ప్రకటన ఇచ్చారని విమర్శించారు. ఫించన్ పంపిణీకి ఉద్యోగులని గంటసేపు పంపించ లేనని విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని.. ఆయనకి పంపిణీ చేయడం ఇష్టం లేదని ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 01:55 PM