సీఎంపై కేసు నమోదు చేయండి

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:29 AM

జగన్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ను ఇవ్వ కుండా మోసం చేసిందని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు, కైకలూరు నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు అన్నారు.

కైకలూరు, లక్కవరంలో పోలీసులకు

టీడీపీ నాయకుల ఫిర్యాదు

కైకలూరు/జంగారెడ్డిగూడెం, జనవరి 10: జగన్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ను ఇవ్వ కుండా మోసం చేసిందని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు, కైకలూరు నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు అన్నారు. బుధవారం తెలుగుయువత ఆధ్వర్యంలో కైకలూరు టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వకుండా ముఖ్యమంత్రి మోసం చేశారని కైకలూరు టౌన్‌ పోలీసు స్టేషన్లో సీఐ ఆకుల రఘుకు ఫిర్యాదు చేశారు. మాట ఇచ్చి మోసం చేసినందుకు సీఎంపై కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగం 6.5 శాతం పెరిగిందని, వలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తన సొంత పత్రికల్లో కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షుడు గోలి అనిల్‌ ఆధ్వర్యంలో సీఎంపై ఫిర్యాదు చేశారు. తెలుగు యువత ముప్పిడి వేణు, చిలింతరాజుల మురళీ, జుజ్జవరపు వెంకట్‌, వీరబాబు, యుగంధర్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Updated at - May 06 , 2024 | 11:40 PM