Share News

AP SSC Results: పది ఫలితాల్లో ఎవరిది పైచేయి.. ఫస్ట్.. లాస్ట్ ఏ జిల్లా..?

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:01 PM

పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6,16,615 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించామని సురేష్ తెలిపారు. పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే.. 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.

AP SSC Results: పది ఫలితాల్లో ఎవరిది పైచేయి.. ఫస్ట్.. లాస్ట్ ఏ జిల్లా..?

విజయవాడ: పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6,16,615 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించామని సురేష్ తెలిపారు. పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే.. 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. మొత్తం 5,34,674 మంది పాస్ అయ్యారని తెలిపారు. ఈ సంవత్సరం 10 పరీక్ష లో ఒక్క విద్యార్థి కూడా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు. ఒక ఉపాధ్యాయుని పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని సురేష్ వెల్లడించారు.

Loksabha Elections: బెంగళూరు చేరిన ఖమ్మం పంచాయితీ


బాలికలదే పైచేయి..!

ఈ సారి ఉత్తీర్ణతలోను బాలికలదే పైచేయి

పది పరీక్ష ఫలితాలు విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యం

ఈ పరీక్ష తరువాతే విద్యార్థి తను చదవాల్సిన స్ట్రీమ్. ఎంచుకుంటారు

45 వేల మంది పరీక్ష లు సిబ్బందిని వాడాము

స్పాట్ వాల్యూషన్ కోసం 25 వేల మంది నీ ఉపయోగించాం

17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి పాస్ కాలేదు

మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా (ఎక్కువ శాతం పాసయిన వారు)

చివరి స్థానంలో కర్నూల్ జిల్లా

ఈసారి పెన్ నంబర్!!

దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్‌కు సంబంధించి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ త్వరలో వస్తారు

భవిష్యత్తులో ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే పెన్ నంబర్ ద్వారా అన్ని సర్టిఫికెట్‌లు ఇస్తారు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పెన్ నంబర్ కూడా ఇస్తారు

ఈ సారి 10 సర్టిఫికెట్‌లో పెన్ నంబర్ కూడా ఇస్తారు

ఇవి కూడా చదవండి...

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం


Updated Date - Apr 22 , 2024 | 12:19 PM