Share News

Food Crises: ఆహార సంక్షోభంపై సంచలన నివేదిక.. వీరిపైనే ఎక్కువ ప్రభావం

ABN , Publish Date - Apr 28 , 2024 | 08:00 AM

ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.

Food Crises: ఆహార సంక్షోభంపై సంచలన నివేదిక.. వీరిపైనే ఎక్కువ ప్రభావం
282 million people in 59 countries hungry in 2023

ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఆహార సంక్షోభంపై గ్లోబల్ రిపోర్ట్(UNO) ప్రకారం ఆకలితో అలమటిస్తున్న వారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.


32 దేశాలలో 36 మిలియన్లకు పైగా ఐదేళ్లలోపు పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. దీని కారణంగా గాజా స్ట్రిప్, సూడాన్‌లలో ఆహార భద్రత పరిస్థితి మరింత దిగజారిందని గుర్తు చేసింది. మొత్తంగా 2023లో పోషకాహార లోపం పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని తెలుపగా వాటిలో మొదటిది దేశాల మధ్య యుద్ధం, రెండవది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెరిగిన స్థానభ్రంశమని చెప్పింది. ఐక్యరాజ్యసమితి(UNO) 'గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్(Global Report on Food Crises)'లో ఈ సమాచారాన్ని వెల్లడించింది.


2016లో ప్రపంచ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య ఇదే అత్యధికమని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో(Máximo Torero) అన్నారు. ఈ నివేదిక ప్రకారం దక్షిణ సూడాన్, బుర్కినా ఫాసో, సోమాలియా, మాలీలలో వేలాది మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని రిపోర్ట్ తెలిపింది. గాజాలో 11 లక్షల మంది, దక్షిణ సూడాన్‌లో 79 వేల మంది జూలై నాటికి 5వ దశకు చేరుకోవచ్చని అంచనా వేసింది.

దీంతో కరువును ఎదుర్కోవాల్సిన దశ కూడా మొదలవుతుందని చెప్పింది. అలాగే 2016లో నమోదైన సంఖ్యతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిందని తెలిపింది. తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న వారిలో 80 శాతం మంది అంటే 5,77,000 మంది ఒక్క గాజాలోనే ఉన్నారని ఆర్థికవేత్త చెప్పారు. ఇక్కడ ఆకలి అత్యంత దారుణంగా ఉందన్నారు.


ప్రపంచంలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న మొదటి 10 దేశాలు

సంఖ్య దేశం ఆకలితో బాధపడుతున్న వ్యక్తులు (మిలియన్లలో)

1. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 25.8

2. నైజీరియా 24.8

3. సుడాన్ 20.2

4. ఆఫ్ఘనిస్తాన్ 19.9

5. ఇథియోపియా 19.7

6. యెమెన్ 18.0

7. సిరియా 12.8

8. బంగ్లాదేశ్ 11.9

9. పాకిస్తాన్ 11.8

10. మయన్మార్ 10.6


ఇది కూడా చదవండి:

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్


Read Latest International News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 08:06 AM