Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు..

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:45 PM

వేదమాత శ్రీ గాయత్రి సంస్థాన్, శ్రీ మహాసిద్ధ దత్తాత్రేయ స్వామి పీఠం హెచ్ బీ కాలనీ విశాఖపట్నంలో శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఆశీస్సులతో మేధా దక్షిణామూర్తి విగ్రహ సహిత సప్త మహర్షులు ప్రతిష్ఠ మహోత్సవం..

Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు.. 1/6

స్వస్తిశ్రీ శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధఇ నామ సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశీ ఆదివారం ఉత్తర ఫల్గుణీ నక్షత్ర మిథున లగ్నమునందు అనగా 21-04-2024 వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమ వేడుకగా పండితులు నిశ్చయించారు.

Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు.. 2/6

బ్రహ్మశ్రీ మండ వేణుగోపాలరావు, శ్రీమతి అన్నపూర్ణ పద్మావతి దంపతుల పవిత్ర హస్తాల మీదుగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ

Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు.. 3/6

18-04-2024 న ఆలయ ప్రదక్షిణ, గోపూజ, భూతబలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, దీక్షాధారణ, ఋత్విగ్వరణం, రక్షా బంధనం, జపాలు, అఖండ దీపారాధన, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి.

Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు.. 4/6

19-04-2024 న గణపతి పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మూల తంత్ర హోమాలు, ప్రసాద వితరణ, శాంతి కలశావాహనం, నిత్య బలిహరణ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పాలతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు.. 5/6

20-04-2024న గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, బింబశుద్ధి క్షీరాభిషేకం, మూలమంత్ర హోమాలు, ధాన్యాధివాసం, అధివాసాంగ హోమాలు, మంత్ర పుష్పములు చతుర్వేద స్వస్తి, సాయంత్రం దక్షిణమూర్తి వైభవం ప్రవచనం కార్యక్రమాలు జరుగుతాయి.

Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు.. 6/6

21-04-2024న విశేష ద్రవ్యాలతో ఆధివాసములు, ప్రధాన కుంభ స్థాపన, మార్జనలు, శాలార్చన, శాంతి హోమాలు, కళా హోమాలు, శాలాంగ హోమాలు, పంచ శయాధివాసములు, పీఠన్యాసము, గర్తన్యాసము, రత్నన్యాసము, యంత్ర, బింబ దేవతా, అభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.

Updated at - Apr 19 , 2024 | 12:45 PM