Share News

BRS: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేడు.. వేడుకలు సాదాసీదాగా జరపాలని నిర్ణయం

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:39 AM

తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్(BRS) పార్టీ శనివారం 24వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. పార్టీ నేతలందరూ ఎంపీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నందునా ఆవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) నేతలు, కార్యకర్తలను ఆదేశించారు.

BRS: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేడు.. వేడుకలు సాదాసీదాగా జరపాలని నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్(BRS) పార్టీ శనివారం 24వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.

పార్టీ నేతలందరూ ఎంపీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నందునా ఆవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) నేతలు, కార్యకర్తలను ఆదేశించారు.


ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండా ఎగురవేయనున్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండటంతో ఆర్భాటాలు లేకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BJP: కాంగ్రెస్‌ను దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరు: బండి సంజయ్

Updated Date - Apr 27 , 2024 | 08:41 AM