Share News

Delhi Liquor Scam: ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:18 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.

Delhi Liquor Scam:  ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
BRS MLC Kavitha Bail Pitition

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది. ఈడీ తరపున సుదీర్ఘ వదనలున్నాయని కోర్టుకు ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలిపారు. ఈడీ వాదనల అనంతరం కవిత తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.

Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!


నేటి ఈడీ వాదనలు ఇవీ...

సుప్రీంకోర్టులో (Supreme Court) కవితకు సెప్టెంబర్ 26న 2023న తదుపరి 10 రోజుల వరకు సమన్లు ఇవ్వమని మాత్రమే ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని ఈడీ తరపున్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు కవితను అరెస్ట్ చేయవద్దని ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ అంశాలను రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరించింది. కవితను మార్చి 15 సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది. తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మార్చి 19న ఉపసంహరించుకున్నారని కోర్టుకు ఈడీ తరపు లాయర్ తెలిపారు.

Lok Sabha Elections 2024: రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి..


ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు: ఈడీ

‘‘కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్నారంటేనే అర్ధం అవుతుంది.. అరెస్ట్ చట్ట విరుద్ధంగా జరిగిందని. కవితకు వ్యతిరేకంగా శరత్, మాగుంట, శ్రీనివాసులు రెడ్డి రాఘవ,బుచ్చిబాబు వాంగ్మూలాలు ఇచ్చారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశాము. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్ళై కవిత బినామీగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దు. అరెస్ట్‌కు గల కారణాలపై కవిత సంతకం తీసుకున్నాం. గంటల్లో కవితను కోర్టు ముందు హాజరుపరిచాం. కవితను అరెస్ట్ చేయమని ఎలాంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదు. కవిత అరెస్ట్ సందర్భంగా ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం లేదు. ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ దీనికి దేశమంతా పరిధి ఉంది. పీఎంఎల్ఏ చట్టం కనుక అరెస్ట్‌కు ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత బినామిగా అరుణ్ పిళ్ళై ఉన్నారు. ఇండో స్పిరిట్స్‌లో కవితకు 32 శాతం వాటా ఉంది. సౌత్ గ్రూప్‌లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్ మండూరి బినామిగా ఉన్నారు. దినేష్ అరోరా విచారణ సందర్భంగా అనేక అంశాలను వెల్లడించారు. బుచ్చిబాబు ఫోన్‌లో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కీలక సమాచారం లభించింది’’ అంటూ ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ సీటు ఖరారు! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 03:37 PM