Share News

Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:19 PM

Telangana: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి కావేరి బవేజ మే 2కు రిజర్వ్ చేశారు. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా... కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలన్నారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు.

Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
Judgment reserved on Kavitha bail petition

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో (Delhi Rouse Avenue Court) వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి కావేరి బవేజ మే 2కు రిజర్వ్ చేశారు. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో విచారణ జరుగగా... కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలన్నారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు.

LinkdIn: భారత్‌లో పని చేసేందుకు టాప్ 5 ది బెస్ట్ కంపెనీలేంటో తెలుసా


ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఈడి కస్టడీలో ఉన్నామని.. సీబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందని లాయర్ ప్రశ్నించారు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి స్టార్ క్యాంపైనర్ అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని... రూలింగ్‌లో ఉన్నప్పుడే ఏం చెయ్యలేకపోయామన్నారు. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందన్నారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదన్నారు. అరెస్ట్ సరయిన కారణాలు లేవని కవిత తరపున లాయర్లు వాదనలు వినిపించారు.

Hanuman Jayanthi: రేపు హనుమాన్ శోభాయాత్రకు పూర్తైన ఏర్పాట్లు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..


అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ (CBI) వాదనలు వినిపించింది. కవిత ప్రభావితం చేయగలుగుతారని.. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తరపు న్యాయవాదలు కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న జడ్జి కావేరి బవేజ తీర్పును మే 2కు వాయిదా వేశారు. మరికొద్దిసేపట్లో ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రారంభంకానున్నాయి.


ఇవి కూడా చదవండి...

Loksabha Polls: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ నామినేషన్

TS Politics: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 02:28 PM