ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:38 AM
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) చిన్నవెంకన్న ఆలయంలో ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 21వ తేదీన ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా అలంకరించనున్నారు. 22న ధ్వజారోహణం, 24న ఎదుర్కోలు ఉత్సవం, 25న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 26న స్వామివారి రథోత్సవం, 28న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తికానున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యార్జిత సేవలు, కల్యాణాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
సరస్వతీదేవి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు..
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆరోరోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శుక్రవారం) సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు కుంకుళ్లమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు.
కోనసీమలో కరెన్సీ అమ్మవారు..
కోనసీమలో కరెన్సీ అమ్మవారు దర్శనమిస్తున్నారు. దసరా సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో కనువిందు చేస్తున్నారు. రూ. నాలుగున్నర కోట్ల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కరెన్సీ తోరణాల మధ్య భక్తులకు మహాలక్ష్మి దేవిగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News