తిరుమలకు 10 టన్నుల కాయగూరల వితరణ

ABN , First Publish Date - 2020-12-22T05:17:15+05:30 IST

తిరుమల నిత్యాన్నదానానికి పలమనేరు మండీ యజమానులు సోమవారం 10 టన్నుల కాయగూరలను వితరణగా పంపించారు.

తిరుమలకు 10 టన్నుల కాయగూరల వితరణ
తిరుమలకు కాయగూరలను తరలిస్తున్న మండీ నిర్వాహకులు

పలమనేరు రూరల్‌, డిసెంబరు 21 : తిరుమల నిత్యాన్నదానానికి పలమనేరు మండీ యజమానులు సోమవారం 10 టన్నుల కాయగూరలను వితరణగా పంపించారు. ఈనెల 25వ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేకలారీలో కాయగూరలు తరలించారు. ఈ కార్యక్రమంలో మండీ యజమానులు కుమార్‌, ఏఎస్‌ఆర్‌ శంకర్‌, రెడ్డెప్ప, నరేష్‌కుమార్‌, రాజా, రెడ్డి, శంకర, నాగిరెడ్డి, డైరెక్టర్‌ హరీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-22T05:17:15+05:30 IST