రూ.73.86 కోట్ల పంట బీమా పరిహారం విడుదల
ABN , First Publish Date - 2020-12-16T05:06:21+05:30 IST
ప్రభుత్వం అన్నదాతని ఆదుకొనేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్నదని సీఎం జగన్ అన్నారు.
గుంటూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అన్నదాతని ఆదుకొనేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్నదని సీఎం జగన్ అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ స్విచ్ నొక్కి రైతుల ఖాతాల్లో ఖరీఫ్ 2019 సీజన్ పంట నష్టం బీమా పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 58,955 మంది అన్నదాతలకు రూ.73.86 కోట్ల బీమా పరిహారం అందుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రైతుభరోస) ఏఎస్ దినేష్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, ఉద్యానవన శాఖ డీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు.