పెరిగిన మేత ధర.. నష్టాల్లో ఆక్వా రైతులు
ABN , First Publish Date - 2020-02-24T09:19:24+05:30 IST
మార్కెట్‌లో పది టన్నులు తవుడు (డీవోబీ) రూ.1.60 లక్షలుపైగా పలుకుతోంది. రొయ్యల సాగు ఆశాజనకంగా లేకనష్టాలు పెరిగిపోవటంతో చేపల సాగువైపు రైతులు మొగ్గు చూపడటంతో డిమాండ్ ఏర్పడిందని రైతులంటున్నారు.
కలిదిండి : మార్కెట్‌లో పది టన్నులు తవుడు (డీవోబీ) రూ.1.60 లక్షలుపైగా పలుకుతోంది. రొయ్యల సాగు ఆశాజనకంగా లేకనష్టాలు పెరిగిపోవటంతో చేపల సాగువైపు రైతులు మొగ్గు చూపడటంతో డిమాండ్ ఏర్పడిందని రైతులంటున్నారు. ఎనిమిది నెలల వ్యవధిలో చేప మూడున్నర కిలోల ఆహారం తీసుకుని కిలో బరువు పెరుగుతుంది. చెరువులో ఉన్న చేపల సైజు బటికట మేత పరిమాణం ఆధారపడి ఉంటుంది. తవుడుతోపాటు వేరుశనగ చెక్క, పత్తి పిండి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. చేపల మేత ధరతోపాటు చెరువుల లీజులు కూడ పెరిగాయి. ఎకరానికి రూ.80 వేలకుపైగా లీజు చెల్లిస్తున్నారు. గతంలో రూ.40 వేలు నుంచి రూ.60 వేలు మధ్యలో ఉండేది. దీంతో రైతులు బెంబేలె త్తుతున్నారు.
చేపకు అదనంగా రూ.30 ఖర్చు
చేప కిలో పెరగాలంటే ప్రస్తుతం రూ.30 అదనంగా ఖర్చు అవుతుందని రైతులంటున్నారు. డీవోబీ, పత్తిపిండి, వేరుశెనగ చెక్కలు ధరలు పెరగటంతో ఖర్చు పెరిగిందని రైతులు వాపోతున్నారు. అయితే మార్కెట్‌లో చేపల ధర మాత్రం పెరగటం లేదని ఆదేవన వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు వాతావరణ పరిస్థితుల వల్ల పలు రకాల వ్యాధులతో చేపలు చచ్చిపోతూ తీవ్రంగా నష్టాన్ని మిగిల్చుతున్నాయంటున్నారు. మార్కెట్‌లో కిలోపైన ఉన్న చేపలు రూ.110 గరిష్టంగా ఉండగా, రూ.90 కనిష్టంగాఉంది. అదనపు ఖర్చు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.