పేదల పెన్నిధి వీఎం రంగా

ABN , First Publish Date - 2020-12-27T05:49:34+05:30 IST

పేదల పెన్నిధి వీఎం రంగా

పేదల పెన్నిధి వీఎం రంగా
రంగా విగ్రహానికి నివాళులర్పిస్తున్న శ్రీరాం తాతయ్య, వంగవీటి రాధా

జగ్గయ్యపేట, డిసెంబరు 26: పేదల పెన్నిధి వంగవీటి మోహన రంగా అని టీడీపీ జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. శనివారం రంగా వర్ధంతి సందర్బంగా రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి కోదాడరోడ్డులోని రంగా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో రంగా చెరగని ముద్ర వేశారని అన్నారు. సామినేని బాబ్జీ నాయుడు, జనసేన నేత కిశోర్‌, ఎం.శ్రీను పాల్గొన్నారు. రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగ్గయ్యపేట వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఘనస్వాగతం లభించింది. వంగవీటి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రంగా విగ్రహం వద్ద నుంచి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తాతయ్య ఇంట్లో అల్పాహారం ఏర్పాటు చేశారు. మాజీ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మేకా వెంకటేశ్వర్లు రాధాను కలిశారు.


Updated Date - 2020-12-27T05:49:34+05:30 IST