సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు

ABN , First Publish Date - 2020-12-16T05:24:34+05:30 IST

పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణ రావు హెచ్చరించారు.

సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు


కనిగిరి, డిసెంబరు 15 : పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోతే  చర్యలు  తప్పవని కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణ రావు  హెచ్చరించారు. పారిశుధ్య సిబ్బంది పనితీరుపై పట్టణంలో శివనగర్‌కాలనీ, గార్లపేట రోడ్డులలో కమిషనర్‌ మంగళవారం పర్య టించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పారిశుధ్య పరి స్థితులపై శానిటరీ సెక్రటరీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించాలని ఆదే శించారు.  రోడ్లపై, కాల్వలపై చెత్తవేయొద్దని ప్రజలకు అవగాహన క ల్పించారు. డ్రైన్లు లేని ప్రాంతాలపై ప్రతిపాదన సిద్ధం చేయాలని సెక్రటరీలకు కమిషనర్‌ సూచించారు. గార్లపేట రోడ్డులోని వృ ద్ధాశ్ర మం వెనుక అనుమతులు లేకుండా అనధికారికంగా వేస్తున్న వెంచ ర్‌ను తనిఖీ చేసి లేఅవుట్‌ వేసిన వారిపై  చర్యలు తీసుకో వాలని వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలను ఆదేశించారు. ఆయన వెంట సచివా లయ సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2020-12-16T05:24:34+05:30 IST