విప్లవ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి

ABN , First Publish Date - 2020-12-23T05:05:24+05:30 IST

తెలుగునాడు పోరాటంతో ఎంతోమందిని ప్రభావితం చేసిన విప్లవ సాంస్కృతిక యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి అని అరుణో దయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు సన్నశెట్టి రాజశేఖర్‌ అన్నారు. కొత్తరోడ్డు జంక్షన్‌లోని అఖిల భారత రైతుకూలీ సంఘం కార్యాలయంలో మంగళవారం పాణి గ్రాహి వర్ధంతి నిర్వహించారు.

విప్లవ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి
పలాస: సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతిని నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

ఆమదాలవలస/గుజరాతీపేట: తెలుగునాడు పోరాటంతో ఎంతోమందిని ప్రభావితం చేసిన విప్లవ సాంస్కృతిక యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి అని అరుణో దయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు సన్నశెట్టి రాజశేఖర్‌ అన్నారు. కొత్తరోడ్డు జంక్షన్‌లోని అఖిల భారత రైతుకూలీ సంఘం కార్యాలయంలో మంగళవారం పాణి గ్రాహి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రగులుతున్న పోరాటాలకు దిక్సూచిగా పాణిగ్రాహి చరిత్ర నిలిచిందన్నారు. ముందుగా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు మార్పు మల్లేశ్వరరావు, కేఎన్‌సీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమ్రోకసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి నేతింటి నీలంరాజు పాల్గొన్నారు.


అణగారిన వర్గాలను జాగృతం చేసిన వ్యక్తి..

 పలాస: పెన్ను, గన్ను పట్టి అణగారిన వర్గాలను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి అని వక్తలు కొనియాడారు. మంగళవారం స్థానిక సూదికొండ కాలనీ సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ కార్యాలయంలో  సుబ్బారావు పాణిగ్రాహి  వర్ధంతిని నిర్వహించారు. పాణిగ్రాహితో పాటు అమరులైన పంచాది నిర్మల, అంకమ్మ, సరస్వతి, ఉమారావు, రమేష్‌చంద్ర సాహు కు కూడా నివాళులర్పించారు. పాణిగ్రాహి భార్య సురేఖ పాణి గ్రాహి ఎర్రజెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వంకల మాధ వరావు, భైరి కూర్మారావు, గొరకల బాలకృష్ణ పాల్గొన్నారు.

 


Updated Date - 2020-12-23T05:05:24+05:30 IST