సమగ్ర భూ సర్వేకు రైతులు సహకరించాలి
ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST
భూమిపై శాశ్వత హక్కు కల్పించేందుకు చేపట్టనున్న సమగ్ర భూ రీసర్వేకు రైతులంతా సహకరించాలని తహసీల్దార్ బీవీ రాణి కోరారు.
తహసీల్దార్ బీవీ రాణి
పరవాడ, డిసెంబరు 18: భూమిపై శాశ్వత హక్కు కల్పించేందుకు చేపట్టనున్న సమగ్ర భూ రీసర్వేకు రైతులంతా సహకరించాలని తహసీల్దార్ బీవీ రాణి కోరారు. పరవాడ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి- మా హామీ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వీఆర్‌వో, వీఆర్‌ఏ, మండల, గ్రామ సర్వేయర్లు కలిసి భూముల సమగ్ర రీసర్వే నిర్వహిస్తారని తెలిపారు. సంబంధిత రైతులు వారి సరిహద్దులు, హక్కు పత్రాలు చూపించాలన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్‌ల దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, చుక్క రామునాయుడు, శిరపురపు అప్పలనాయుడు, పైలా సన్యాసిరావు, పైలా అప్పలనాయుడు, చల్లా కనకారావు, పైలా హరీశ్, రెవెన్యూ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.