సాధారణ సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-15T05:42:48+05:30 IST
ఏలూరు నగరంలో సోమ వారం కూడా ఎటువంటి వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు.
రెండో రోజూ నమోదు కాని వింత వ్యాధి కేసులు
ఏలూరు క్రైం,డిసెంబరు 14 :ఏలూరు నగరంలో సోమ వారం కూడా ఎటువంటి వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం కేసులు లేకపోయినప్పటికీ అంతుపట్టిని వ్యాధి కేసులకు చికిత్సలు అందించడానికి ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను, సిబ్బంది యధావిధిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆఖరి కేసు వచ్చిన తరువాత 72 గంటల లోపు ఎలాంటి కేసు నమోదు కాకపోతే ఇక్కడ ఉన్న ఇతర ప్రాంతాల సిబ్బందిని తిరిగి పంపించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇంకోవైపు కొవిడ్ సేవలు పూర్తి స్థాయిలో ముగిసిపోవడంతో వీటి కోసం రిక్రూట్ చేయబడ్డ వారు ఈ నెలాఖరులోపు వారి సేవలు నిలుపుదల చేసే అవకాశాలున్నాయి. సోమవారం ఏలూరు ప్రభుత్వాసు పత్రికి సాధారణ వైద్యసేవలు పొందడానికి ఔట్ పేషెంట్లు వచ్చారు. దీంతో ప్రత్యేక విభాగంలో ఉన్న వైద్యులు ఓపీలో ఉండి సాధారణ వైద్య సేవలందించారు.