బకెట్‌తో వర్కవుట్
ABN , First Publish Date - 2020-10-15T16:29:26+05:30 IST
జిమ్‌కు వెళ్లలేకపోయిన వారు ఇంటివద్దనే వ్యాయామాలు చేసేయొచ్చు. ఇంట్లోని వస్తువులతో రోజు ఒకదానితో వ్యాయామం చేయొచ్చు. అలాంటిదే బకెట్ వర్కవుట్.
జిమ్‌కు వెళ్లలేకపోయిన వారు ఇంటివద్దనే వ్యాయామాలు చేసేయొచ్చు. ఇంట్లోని వస్తువులతో రోజు ఒకదానితో వ్యాయామం చేయొచ్చు. అలాంటిదే బకెట్ వర్కవుట్. కండరాల దృఢత్వానికి పనికొచ్చే బకెట్ వర్కవుట్ ఎలా చేయాలంటే...
ముందుగా బకెట్‌లో పావువంతు నీళ్లు నింపాలి. బకెట్‌లోని నీళ్లు ఒలికిపోకుండా నెమ్మదిగా వర్కవుట్స్ చేయాలి. కొన్ని రోజులకు సగం బకెట్ నీళ్లతో వర్కవుట్స్ చేయాలి.
బకెట్ ప్రెస్: నేలమీద లేదా బెంచీ మీద వెల్లకిలా పడుకోవాలి. ఇప్పుడు బకెట్‌ను కింద పట్టుకొని ఛాతి నుంచి వీలైనంత దూరంగా తీసుకెళ్లాలి. తరువాత ఛాతివైపు తీసుకురావాలి. ఈ వర్కవుట్‌తో ఛాతి దగ్గరి కండరాలకు వ్యాయామం లభిస్తుంది.
బకెట్ ఫ్రంట్ రైజ్: నిటారుగా నిల్చొని రెండు చేతులతో బకెట్‌ను పట్టుకోవాలి. ఇప్పుడు బకెట్‌ను భుజాల ఎత్తు వరకు తీసుకురావాలి. ఆ తరువాత నెమ్మదిగా తొడ భాగం వద్దకు తేవాలి. దీంతో ఒక రౌండ్ పూర్తవుతుంది. ఇలానే కొద్దిసేపు చేయాలి.
బకెట్ కర్ల్: బకెట్‌లో నీళ్లను సగానికి సగం తగ్గించాలి. ఇప్పుడు బకెట్‌ను కుడి చేతితో పట్టుకొని భుజం ఎత్తుకు తీసుకురావాలి. శరీరం, భుజం నిటారుగా ఉంచాలి. మోచే యి మాత్రమే కదిలించాలి. ఇదే విధంగా ఎడమచేతితోనూ బకెట్ కర్ల్ వర్కవుట్ చేయాలి. దీంతో భుజం దగ్గరి కండరాలు బలోపేతం అవుతాయి.