కెటిల్‌బెల్‌తో ‘కొవ్వు’ కేక!
ABN , First Publish Date - 2020-07-04T19:08:34+05:30 IST
బరువులతో చేసే వ్యాయామాలతో చేతులు, పిరుదులు, కాళ్లలోని కొవ్వును కరిగించవచ్చు. ఇందుకోసం ‘కెటిల్‌బెల్’ బాగా ఉపయోగపడుతుంది. వీటితో ఎలాంటి వ్యాయామాలు చేయాలంటే..
ఆంధ్రజ్యోతి(04-07-2020)
బరువులతో చేసే వ్యాయామాలతో చేతులు, పిరుదులు, కాళ్లలోని కొవ్వును కరిగించవచ్చు. ఇందుకోసం ‘కెటిల్‌బెల్’ బాగా ఉపయోగపడుతుంది. వీటితో ఎలాంటి వ్యాయామాలు చేయాలంటే..
ఎరౌండ్ ది బాడీ పాస్: మూడు లేదా ఐదు కిలోల బరువున్న కెటిల్‌బెల్‌ను రెండు చేతుల్లోకి తీసుకుని నిలబడాలి. తర్వాత ఒక చేతిలోకి కెటిల్‌బెల్‌ను తీసుకొని శరీరం వెనక్కి తీసుకువెళ్లి, రెండో చేత్తో అందుకుని, ముందుకు తీసుకురావాలి. ఇలా కెటిల్‌బెల్‌ను శరీరం చుట్టూ తిప్పుతూ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాన్ని 15 సార్లు, 3 సెట్ల చొప్పున చేయాలి.
బెంట్ రో: రెండు చేతులతో కెటిల్‌బెల్ పట్టుకుని నిలబడాలి. మోకాళ్లను కొద్దిగా వంచి, కుంగుతూ కెటిల్‌బెల్‌ను పాదాల దగ్గరకు తీసుకువెళ్లాలి. తర్వాత నెమ్మదిగా పైకి లేవాలి. ఇలా వంగుతూ, లేస్తూ 15 సార్లు, 3 సెట్లు చేయాలి.
స్వింగ్: రెండు చేతులతో కెటిల్‌బెల్ పట్టుకుని, రెండు కాళ్ల మధ్య రెండు అడుగుల ఎడంతో నిలబడాలి. మోకాళ్లను వంచుతూ కెటిల్‌బెల్‌ను రెండు చేతులతో శరీరానికి సమాంతరంగా పైకి లేపి, అదే వేగంతో కాళ్ల మధ్యకు తీసుకురావాలి. ఇలా కెటిల్‌బెల్‌ను పైకి, కిందకు స్వింగ్ చేస్తూ 15 సార్లు, 3 సెట్లు చేయాలి.
ఫ్రంట్ స్క్వాట్స్: రెండు కాళ్ల మధ్య ఒకటిన్నర అడుగు దూరంతో నిలబడి, కెటిల్‌బెల్‌ను రెండు చేతులతో ఛాతీ దగ్గరకు లేపి పట్టుకోవాలి. ఇదే భంగిమలో మోకాళ్లను వంచి, కుర్చీలో కూర్చునేంత ఎత్తుకు కుంగి, తిరిగి పైకి లేవాలి. ఇలా 15 సార్లు, 3 సెట్లు చేయాలి.