లాక్‌డౌన్ వర్కవుట్స్
ABN , First Publish Date - 2020-04-14T16:14:12+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా జిమ్‌లు మూసేశారు. ఇంట్లోనే వ్యాయామాలు చేద్దామంటే తగిన పరికరాలు లేవని బాధపడుతున్నారా? అయితే బక్కెట్, ఇల్లు తుడిచే మాపింగ్ స్టిక్ లాంటి కొన్ని వస్తువులతో ఫిట్‌నెస్‌ను పెంచుకునే వీలుంది.
ఆంధ్రజ్యోతి(14-04-2020)
లాక్‌డౌన్ కారణంగా జిమ్‌లు మూసేశారు. ఇంట్లోనే వ్యాయామాలు చేద్దామంటే తగిన పరికరాలు లేవని బాధపడుతున్నారా? అయితే బక్కెట్, ఇల్లు తుడిచే మాపింగ్ స్టిక్ లాంటి కొన్ని వస్తువులతో ఫిట్‌నెస్‌ను పెంచుకునే వీలుంది.
అదెలాగంటే....
టవల్: టవల్‌ను తాడులా మడిచి, రెండు చేతులతో దాని రెండు కొసలు లాగి పట్టుకుని తల పైకి లేపాలి. అలాగే చేతులను వీపు మీదుగా వెనకకు దింపాలి. ఇలా 15 సార్లు 3 సెట్లు చేయాలి.
క్లీనింగ్ స్టిక్: మోకాళ్లు, చేతులు నేల మీద ఆనించి కూర్చోవాలి. ఒక చేత్తో స్టిక్ పట్టుకుని, నేలకు సమాంతరంగా ముందుకు చేతిని చాపాలి. తిరిగి వెనకకు తీసుకువచ్చి, రెండో చేత్తో చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు వెన్నుకూ, పిరుదులకూ వ్యాయామం చేసినట్లవుతుంది.
బక్కెట్: చిన్న బక్కెట్‌లో రెండు లీటర్ల నీళ్లు నింపి, రెండు చేతులు చాపి పట్టుకోవాలి. నిటారుగా నిలబడినప్పుడు చాపిన చేతుల్లోని బక్కెట్ నుదుటికి సమాంతరంగా ఉండేలా చూసుకుని, మోకాళ్లు వంచి, కిందకు కుంగి పైకి లేస్తూ ఉండాలి. ఇలాంటి స్క్వాట్స్ 15 సార్లు, వంతున 3 సెట్లు చేయాలి.
నేల మీద: కాళ్లు మడిచి, వెల్లకిలా పడుకుని, నడుము పై భాగాన్ని మోకాళ్ల దగ్గరకు లేపే క్రంచెస్ చేయవచ్చు. రెండు కాళ్లూ నిలువుగా పైకి లేపే లెగ్ రైజింగ్స్ చేసుకోవచ్చు. ఈ వ్యాయామాలతో పొత్తికడుపు దగ్గర కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.