నిల్చొని... నిదానంగా..
ABN , First Publish Date - 2020-05-14T14:46:41+05:30 IST
కసరత్తులు అనగానే అతిగా ఆయాసపడాల్సిన అవసరం లేదు. నిల్చొన్న చోటనే నిదానంగా చేస్తూనే... మంచి ఫిట్‌నెస్‌నిచ్చే వ్యాయామాలూ ఉన్నాయి. నడుము, తొడ కండరాలను పటుత్వంగా ఉంచే సులువైన ఎక్స్‌ర్‌సైజ్ ఇది.
ఆంధ్రజ్యోతి(14-05-2020):
కసరత్తులు అనగానే అతిగా ఆయాసపడాల్సిన అవసరం లేదు. నిల్చొన్న చోటనే నిదానంగా చేస్తూనే... మంచి ఫిట్‌నెస్‌నిచ్చే వ్యాయామాలూ ఉన్నాయి. నడుము, తొడ కండరాలను పటుత్వంగా ఉంచే సులువైన ఎక్స్‌ర్‌సైజ్ ఇది.
నిటారుగా..: మోకాళ్ల కన్నా తక్కువ ఎత్తున్న చిన్న స్టూల్ తీసుకోండి. దానికి ఓ అడుగు దూరంలో వెనక్కు తిరిగి, నిటారుగా నిల్చోండి. ఇప్పుడు కుడి పాదాన్ని వెనకనున్న స్టూల్‌పై పెట్టండి. మీ మునివేళ్లు మాత్రమే స్టూల్‌పై ఉండాలి.
మోకాలు వంచి..: మొదటి పొజిషన్‌లో ఉంటూనే ఎడమ మోకాలిని నేలకు దగ్గరగా వచ్చేలా వంచండి. ఈ పొజిషన్‌లో రెండు మోకాళ్లను దాదాపు 90 డిగ్రీలు వంచాలి.
బ్యాలెన్స్..: ఇప్పుడు శరీరం బరువునంతటినీ నేలపైనున్న ఎడమ కాలిపై ఉంచుతూ, మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. ఎన్ని సార్లు సాధ్యమైతే అన్నిసార్లు ఇలా చేయండి. తరువాత కాళ్లు మార్చి, మళ్లీ ఇదే విధంగా ప్రయత్నించండి.