వెన్నెముక దృఢత్వానికి..
ABN , First Publish Date - 2020-06-06T17:58:11+05:30 IST
భుజాలు, వెన్నెముక, నడుము, మెడ భాగాలు దృఢమవ్వడానికి సూపర్‌మ్యాన్ ఎక్స్‌ర్‌సైజ్ బాగా ఉపయోగపడుతుంది. చాలా సులువుగా, పెద్దగా శ్రమ లేకుండా చేయగలిగే ఈ వ్యాయామాన్ని మీరూ ప్రయత్నించండి...
ఆంధ్రజ్యోతి(06-06-2020)
భుజాలు, వెన్నెముక, నడుము, మెడ భాగాలు దృఢమవ్వడానికి సూపర్‌మ్యాన్ ఎక్స్‌ర్‌సైజ్ బాగా ఉపయోగపడుతుంది. చాలా సులువుగా, పెద్దగా శ్రమ లేకుండా చేయగలిగే ఈ వ్యాయామాన్ని మీరూ ప్రయత్నించండి...
స్టెప్ 1: మ్యాట్‌పై బోర్లా పడుకొని, చేతులు పైకి చాచండి. అరచేతులు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. తల వెన్నుకు సమాంతరంగా ఉండాలి. ముఖం చాపను తాకాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఇది మొదటి భంగిమ.
స్టెప్ 2: అదే భంగిమలో ఉంటూ... కాళ్లు, భుజాల పై భాగాన్ని సాధ్యమైనంత పైకి లేపండి. పొత్తికడుపు, ఛాతీ, నడుము భాగం మాత్రమే నేలపై ఉండాలి. కాళ్లు, చేతులు వంగకూడదు. కొన్ని క్షణాలు ఇలాగే ఉండండి. ఇది రెండో భంగిమ.
స్టెప్ 3: ఇప్పుడు శ్వాస తీసుకొంటూ నిదానంగా కాళ్లు, ఛాతీ పై భాగాన్ని కిందకు తీసుకురండి. అంటే మీ ప్రారంభ భంగిమలోకి రావాలి. అయితే ఇందాక చెప్పినట్టు ఛాతీ నుంచి నడుము వరకు శరీరం కదలకూడదు. ఇదే వరుసలో 10-15 సెట్లు చేయండి.