16 నుంచి చైనా విమాన సర్వీసుల నిలిపివేత
ABN , First Publish Date - 2020-06-04T08:29:16+05:30 IST
అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరంగానే కాకుండా విమానాల రాకపోకలకు సంబంధించిన ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. జూన్ 16 నుంచి అమెరికాకు వచ్చి వెళ్లే నాలుగు చైనా ఎయిర్‌లైన్స్ షెడ్యూల్డ్ ప్యాసెంజర్ విమానాలను...
- అమెరికా నిర్ణయం
వాషింగ్టన్, మే 3: అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరంగానే కాకుండా విమానాల రాకపోకలకు సంబంధించిన ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. జూన్ 16 నుంచి అమెరికాకు వచ్చి వెళ్లే నాలుగు చైనా ఎయిర్‌లైన్స్ షెడ్యూల్డ్ ప్యాసెంజర్ విమానాలను నిలిపివేయనున్నట్టు అమెరికా పాలన యంత్రాంగం బుధవారం తెలిపింది. ఈ వారంలో చైనాకు విమాన సర్వీసు లు పునరుద్ధరించాలని యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్ణయించాయి. అయితే అనుమతులు ఇవ్వడంలో చైనా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే చైనా ఎయిర్‌లైన్స్‌పై చర్య తీసుకుంటున్నట్టు అమెరికా రవాణా విభాగం తెలిపింది. విమాన సర్వీసులకు సంబంధించి ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. అయితే ద్వైపాక్షిక హక్కులను సద్వినియోగపరచుకోవడానికి చైనాతో కలిపి పని చేయనున్నట్టు తెలిపింది.